నామినేషన్ల స్వీకరణలో జాగ్రత పాటించండి

2చూసినవారు
గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల నేపథ్యంలో, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని దుగ్గొండి మండలంలోని శివాజీనగర్, నల్లబెల్లి మండల కేంద్రం, రేలకుంట గ్రామ పంచాయతీలను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్య శారద సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా, తప్పిదాలకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి, పలు కీలక సూచనలు చేశారు.

ట్యాగ్స్ :