వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బుధవారం బీజేపీ నాయకులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.