ఉమ్మడి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో బొడ్డెమ్మ వేడుకలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. గ్రామ ప్రజలు సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మను తయారు చేసి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, బొడ్డెమ్మ చుట్టూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సందడి చేశారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.