హన్మకొండలో బుధవారం జరగనున్న రైతు సంగ్రామ సదస్సుకు వరంగల్ జిల్లా నర్సంపేట నుండి బీఆర్ఎస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. హంటర్ రోడ్డులో జరిగే ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ హాజరుకానున్నారు. నాలుగేళ్ల క్రితం వరంగల్‌లో జరిగిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయో ఈ సదస్సులో ప్రశ్నించనున్నారు.