వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లభామ తండా గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీలకు గ్రామ
కాంగ్రెస్ ఇంచార్జ్ అంగోతు స్వామి నాయక్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మండలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు
కాంగ్రెస్ నాయకుడు అంగోతు స్వామి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ
కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు బాలు నాయక్, సర్పంచ్ గుగులోతు బాలు, ఉప సర్పంచ్ గుగులోతు నీల రామోజీ, వార్డు సభ్యులు ఈరమ్మ, భాస్కర్, స్వామి, వనిత, గీత తదితరులు పాల్గొన్నారు.