వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట 1వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, రహదారుల మెరుగుదల, తాగునీటి సరఫరా వంటి హామీలను వివరించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.