ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం

12చూసినవారు
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సర్పంచ్ ఐలోని రజిత అశోక్ అభినందించారు. ప్రథమ స్థానం సాధించిన కత్తి అంజలికి రూ. 10,016, ద్వితీయ స్థానంలో నిలిచిన పిండి రాంచరణ్కు రూ. 5,016, తృతీయ స్థానం పొందిన షేక్ సమ్రీన్కు రూ. 3,016లను గ్రామ పంచాయతీ తరఫున అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you