వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్ పల్లి ఏడో బెటాలియన్లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీ(ఏ)లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. బుధవారం అశోక్ సొంత గ్రామంలో బంధువులు, మిత్రులు సంబరాలు జరుపుకున్నారు.