వరంగల్ జిల్లాలో కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఎస్సై ఎండి ఆసిఫ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుడు ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తున్నారు.