వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 30 వార్డుల్లోనూ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుందని, బూటకపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలాయి శ్రీనివాస్, పెండెం రామానంద్, రంజిత్ కుమార్ పాల్గొన్నారు.