వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. జూన్ 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరాలను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. పార్టీ సిద్ధాంతాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాల దిశగా కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.