ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు

1883చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేటలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఆధ్వర్యంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ప్రస్తుతం వివిధ డిగ్రీ కోర్సుల్లో అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లకు ఈ నెల 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను ఈ నెల 26వ తేదీన దోస్త్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్