మహిళా జైలును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

2280చూసినవారు
మహిళా జైలును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నర్సంపేటలోని ప్రత్యేక మహిళా జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బి. నిర్మలా గీతాంబ సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, పరిశుభ్రత, న్యాయ సహాయం వంటి అంశాలను ఆమె పరిశీలించారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నర్సంపేట కోర్టు ప్రాంగణాన్ని, పరిసరాలను కూడా ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో DLSA కార్యదర్శి కే. పూజ, న్యాయమూర్తులు, జైలు సూపరింటెండెంట్ స్రవంతి, న్యాయవాదులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్