డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్లకు సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, అభ్యసకుల సహాయ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వి పూర్ణచందర్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. విద్యార్హత ఇంటర్మీడియట్ నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన
విద్యార్థులు నేరుగా డిగ్రీ కోర్సుల అడ్మిషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చని పేర్కొన్నారు. వివరాలకు మొబైల్ నెంబర్ 7382929577 లో సంప్రదించగలరు.