దుగ్గొండి: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

6చూసినవారు
దుగ్గొండి: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివస్ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రణధీర్ మాట్లాడుతూ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్, లోన్ యాప్ మోసాలు, ఓఎల్ఎక్స్ మోసాలు, కొరియర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం ఎవరికీ ఇవ్వవద్దని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్