వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని జల్లి గ్రామంలో 73 ఏళ్ల ఎల్లమ్మ వడదెబ్బతో మరణించారు. రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురై రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎల్లమ్మ పేద కుటుంబానికి చెందినందున ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.