వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు వేములపల్లి నారాయణ వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో ఆదివారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్తతో దీక్షకుంట గ్రామంలో విషాదం నెలకొంది. దేశ స్వాతంత్ర్య సమర స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన నారాయణ సేవలను గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు స్మరించుకున్నారు. ఆయన మరణం గ్రామానికి తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు.