చింతగట్టులో వర్షాన్ని లెక్కచేయని గణేష్ నిమజ్జనం

8చూసినవారు
చింతగట్టులో వర్షాన్ని లెక్కచేయని గణేష్ నిమజ్జనం
నర్సంపేట మండలం చింతగట్టు గ్రామంలో బుధవారం సాయంత్రం గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య, భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అట్టహాసంగా జరిగింది. విపరీతమైన వర్షం కురుస్తున్నప్పటికీ, భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. యువకులు, మహిళలు, భక్తులు డప్పు చప్పుళ్లతో, కేరింతలతో గణనాథుడి శోభాయాత్రను నిర్వహించారు. 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో వీధులు మారుమోగాయి. నిమజ్జన ఏర్పాట్లకు వర్షం కొంత ఇబ్బంది కలిగించినా, భక్తులు కోలాహలంగా లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.

సంబంధిత పోస్ట్