హైదరాబాద్ కూకట్పల్లిలో ఇద్దరు చిన్నారులను చంపి తల్లి స్రవంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. చనిపోవడానికి ముందు ఆమె తన అన్నకు వీడియో సందేశం పంపినట్టు వెలుగులోకి వచ్చింది. అందులో భర్త ప్రవీణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనను చంపేందుకు హైదరాబాద్కు తీసుకువచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడని వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో భర్త ప్రవీణ్పై అనుమానాలు బలపడుతున్నాయి.