బాలాజీ విద్యాసంస్థల్లో ఇంటర్నేషనల్ పీస్ డే వేడుకలు

1373చూసినవారు
బాలాజీ విద్యాసంస్థల్లో ఇంటర్నేషనల్ పీస్ డే వేడుకలు
నర్సంపేట పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డా: వనజా రాజేంద్రప్రసాద్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా శాంతియుతను కోరుతూ ఐక్యంగా ఉండాలని పాఠశాల విద్యార్థులు మెడిటేషన్ చేసారు. ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా శాంతియుత జీవనం గడపాలనే ఉద్దేశంతో ఘర్షణలకు ముగింపు పలకడానికి శాంతియుత సమాజం ఏర్పాటు దిశగా ముందడుగు వేయడానికి శాంతి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయ బృందం విద్యార్థినులు  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్