వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. స్థానిక సర్పంచ్ దాసరి రమేశ్ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్పందించి పంట పొలాల్లో చిరుత జాడల కోసం గాలింపు చేపట్టారు. గ్రామస్థులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనలో ఖానాపూర్ ఎస్సై రామ్మోహన్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.