కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఖానాపురం మండలం లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతు పండించిన అన్ని పంటలకు బోనస్ చెల్లిస్తామని మేనిఫెస్టో చెప్పి, కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. యాసంగి వడ్లకు బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.