
ఇజ్రాయెల్ నుండి ఇండియాకు చేరిన లైట్ మెషీన్ గన్స్
భారత్-ఇజ్రాయెల్ మధ్య ప్రత్యేక సంబంధాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ ప్రత్యేకంగా రూపొందించిన 2,000 లైట్ మెషీన్ గన్స్‌ను ఇండియాకు అందించింది. ఈ ఏడాది చివరికల్లా మరో 4,000 గన్స్ రానున్నాయి. మొత్తం 41,000 గన్స్ అందించేందుకు ఒప్పందం కుదిరింది. మేకిన్ ఇండియాలో భాగంగా అదానీ గ్రూప్, ఇజ్రాయెల్ వెపన్స్ ఇండస్ట్రీస్ కలిసి వీటిని తయారు చేశాయి. ఈ గన్స్ తక్కువ బరువుతో, కచ్చితత్వంతో పనిచేస్తాయి, ఎలాంటి వాతావరణంలోనైనా, ఎక్కడినుంచైనా ప్రయోగించవచ్చు.




