నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చివరి అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. దోస్త్ ద్వారా చివరి విడత దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గత రెండు నెలలుగా కొనసాగుతున్న దోస్త్ ప్రవేశాల ప్రక్రియలో వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోని లేదా ప్రవేశం పొందని
విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.