న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ

5చూసినవారు
న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ
మొయినాబాద్‌లో న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. కోర్టు పనులకు దూరంగా ఉండి, నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, స్వప్నను హత్య చేసిన నిందితులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :