వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన రూ. 10 లక్షల అంచనా వ్యయంతో వివో బిల్డింగ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన రాయిని ఆవిష్కరించారు. ఎన్ ఆర్ ఈ జీ ఎస్ పథకం కింద రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా పూర్తి చేసిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ఆయన ప్రారంభించారు.