నర్సంపేట మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా విస్తృతంగా నమోదు చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు సేకరించి, నాయకుల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.