నల్లబెల్లి: పేపర్ బాయ్ నుంచి దేశ సేవ దిశగా..!

11చూసినవారు
నల్లబెల్లి: పేపర్ బాయ్ నుంచి దేశ సేవ దిశగా..!
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన ముత్యాల సాయికుమార్ అనే యువకుడు పేదరికాన్ని అధిగమించి అగ్నివీర్ గా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చదువుతో పాటు పేపర్ బాయ్ గా పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకున్నాడు. రోజూ తెల్లవారుజామున సైకిల్ పై పత్రికలు పంపిణీ చేస్తూనే, అగ్నివీర్ కావాలనే లక్ష్యంతో శారీరక సాధన కొనసాగించాడు. అతని పట్టుదల, కృషి ఫలించి ఇటీవల జరిగిన ఎంపికల్లో విజయం సాధించాడు.

సంబంధిత పోస్ట్