వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం కల్పించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి కోరారు. బుధవారం నర్సంపేటలోని 22వ వార్డులో బీజేపీ అభ్యర్థి మైసి శోభన్ కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ ప్రచారంలో శ్రీనివాస్, పృథ్విరాజ్, మల్లయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.