వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ, మరియు నర్సంపేట పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీరామానంద్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాల ఆరంభాన్ని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, కొత్త రంగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.