నర్సంపేట: ఆర్టీసీ డిపోలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

61చూసినవారు
నర్సంపేట: ఆర్టీసీ డిపోలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఆధ్వర్యంలో పాస్టర్ రూబెన్ వారి బృందం డిపో ఉద్యోగులు కలిసి కేక్ కట్ చేసి, ప్రార్థన చేశారు. ఏసు ప్రభు పుట్టినరోజు రోజు విశిష్టతను, డిపో ఉద్యోగులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవాని, సూపర్ వైజర్ నారాయణ, డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్