నర్సంపేట: పాఠశాల లో పిచ్చి మొక్కల శుభ్రం

0చూసినవారు
నర్సంపేట: పాఠశాల లో పిచ్చి మొక్కల శుభ్రం
నర్సంపేటలోని 29వ డివిజన్లో గల జెడ్పిఎస్ఎస్ మోడల్ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి 29వ డివిజన్ కౌన్సిలర్ వేముల సంధ్యా సాంబయ్య గౌడ్ పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి, ఈనెల 15న ప్రారంభం కానున్న పాఠశాల ఆవరణాన్ని శుభ్రపరిచారు. రాబోయే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.