వాట్సప్ లో గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని నర్సంపేట సీఐ రఘు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీకే ఫైల్ ను సైబర్ నేరస్థులు పంపి మీ ఫోన్ వారి గుప్పిట్లోకి తీసుకుని ఆ తరువాత మీ ఫోన్ కు వచ్చే ప్రతి మెసేజ్ బ్యాంకు లావాదేవీలను సైబర్ నేరగాళ్లు చదివి మీ బ్యాంకు ఖాతాను కొల్లగొడతారన్నారు. ఎవరైనా సైబర్ దాడికి గురైతే 1930 నంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.