నర్సంపేట: కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ బహిష్కృత మహిళా నేతలు

కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వరంగల్ జిల్లా నర్సంపేట మహిళా నేతలు రజనీ భారతి, ఉమా ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసి, పార్టీపై, పట్టణ అధ్యక్షుడు రాజేందర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము భూకబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులతో డబ్బులు వసూలు చేస్తున్నామా అని ప్రశ్నించారు. మహిళా సంఘం విషయంపై విచారణకు వెళ్లిన తమను, తమ తప్పు లేకుండా బహిష్కరించడం విచారకరమని వారు ఆరోపించారు.