నర్సంపేట: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

66చూసినవారు
నర్సంపేట: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 2వ వార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యుడు రామానంద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి అందిస్తున్న మద్దతు ధరతో పాటు, రూ. 500 బోనస్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు చూడాలన్నారు. వెంకన్న, సాంబరెడ్డి, వంశీకృష్ణ తదితరులు ఉన్నారు

సంబంధిత పోస్ట్