వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముత్తోజుపేట డివిజన్ అభ్యర్థి కాంపెల్లి వీణ – విజేందర్ రెడ్డి గారు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.