గత 5 రోజుల క్రితం మహేశ్వరం గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట మరియు ద్వారకపేట రోడ్ లో నివాసం ఉంటున్న 14, 12 సంవత్సరాల వయసు గల ఇద్దరు బాలురు చదువుపై ఆసక్తి చూపక, ఇంటి వద్ద ఉంటూ చిన్న చిన్న అవసరాలకు డబ్బులు అవసరం ఏర్పడటంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. శుక్రవారం సిసి కెమెరాల సహాయంతో ఈ బాలురను పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 2 తులల బంగారం, 4000 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.