నర్సంపేట: సిద్ధు మృతి కేసును ఛేదించిన పోలీసులు

2920చూసినవారు
నర్సంపేట: సిద్ధు మృతి కేసును ఛేదించిన పోలీసులు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన సిద్దు మృతి కేసులో ఖానాపురం పోలీసులు మిస్టరీని ఛేదించారు. ప్రాథమిక దర్యాప్తులో అనుమానించినట్లుగానే, అత్యంత సన్నిహితులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. కాగితాల విగ్నేష్, అశ్విత్ తేజ, శ్రీ చరణ్, వేముల విగ్నేష్లు కలిసి సిద్దును అంతమొందించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆదివారం సాయంత్రం నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్