వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. 11 కేవీ ఫీడర్-2 పరిధిలోని మల్లంపల్లి రోడ్డు, పాకాల రోడ్, సర్వాపురం ప్రాంతాలలో చెట్లు కొట్టడం, లైన్ మరమ్మతు పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని సంబంధిత శాఖ ఏఈ విజయభాస్కర్ తెలిపారు. వినియోగదారులు సహకరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.