వరంగల్ జిల్లా నర్సంపేటలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ సమక్షంలో ఈ వేలం జరుగుతుందని ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో సోమవారం ఉదయం 9 గంటలకు నర్సంపేట ఎక్సైజ్ కార్యాలయానికి హాజరు కావాలని అధికారులు కోరారు.