ఈనెల 9న జరిగే సార్వత్రిక సంఘం సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ అధికారికి మరియు మున్సిపల్ కమిషనర్ కు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ బహుళ జాతి కంపెనీలకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాలను సవరణ చేసి నాలుగు లేబరు కోడ్లను తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నెల 9న జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.