నర్సంపేట: భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి

65చూసినవారు
నర్సంపేట: భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
భారత రాజ్యాంగాన్ని, వాటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బీరెడ్డి సాంబశివ అన్నారు, వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సీపీఎం వరంగల్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు 4వ రోజు జిల్లా కార్యదర్శి సీ హెచ్ రంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. పెట్టుబడిదారీ సమాజంలో రాజ్యాంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఫలాలు సామాన్య పేదలకు అందలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్