నర్సంపేట నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. గురువారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. నర్సంపేట-వరంగల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా, నర్సంపేట-నెక్కొండ, నర్సంపేట-గూడూరు, నెక్కొండ-కేసముద్రం రోడ్లను వెడల్పు చేస్తామని పేర్కొన్నారు.