నర్సంపేట పట్టణంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో వార్డెన్ల పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వార్డెన్లు క్రమం తప్పకుండా హాస్టళ్లకు రావడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రివేళల్లో
విద్యార్థులు బయటకు వెళ్తున్నారని చెబుతున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అధికారులు హాస్టళ్లను తరచూ తనిఖీ చేసి, పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.