వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర కోసం మంగళవారం రాత్రి నర్సంపేట డివిజన్‌లోని పలు గ్రామాల నుండి ప్రభ బండ్లు బయలుదేరాయి. హోలీ పండుగ తర్వాత సాయంత్రం జాతరకు ప్రభ బండ్లను తరలించడం ఆనవాయితీగా వస్తోంది. వివిధ గ్రామాల నుండి పలు పార్టీల నాయకులు పోటీపడి ప్రభ బండ్లను జాతరకు తరలిస్తున్నారు.