నర్సంపేట: చికిత్సకు చేయూత.. కుటుంబానికి భరోసా

1163చూసినవారు
నర్సంపేట: చికిత్సకు చేయూత.. కుటుంబానికి భరోసా
గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో వరంగల్ జిల్లా నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సామల నైనిక పరిస్థితిని తెలుసుకున్న అభ్యుదయ యూత్ క్లబ్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్ గోగుల రాణాప్రతాప్ రెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించి చిన్నారి ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నైనిక కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేసి, ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్