వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బీసీ కాలనీకి చెందిన పొట్లపల్లి వీరస్వామి ఇంట్లో, రెండు నెలల క్రితం తల్లిని కోల్పోయిన పిల్లి పిల్లను ఒక తల్లి కోడి తన పిల్లలతో పాటు ప్రేమగా సాకుతోంది. రాత్రి వేళల్లో పిల్లి పిల్లను తన వద్దనే నిద్రపుచ్చుకుంటూ, జాతి వైరాన్ని మరిచి మాతృ ప్రేమను చాటుకుంటోంది. ఈ సంఘటన మానవత్వానికి అద్దం పడుతోంది.