వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలో గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన బాధితులను కలిసి వారికి భరోసా కల్పించారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.