వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తిని గురువారం పాము కరిచింది. చికిత్స కోసం నెక్కొండకు రాగా 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో స్పందించిన నెక్కొండ ఎస్సై మహేందర్ తన వాహనంలో నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమయస్ఫూర్తి గా వ్యవహరించి సహయం అందించిన ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు.