వర్షపు నీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు

2961చూసినవారు
నర్సంపేట పట్టణంలోని 10వ వార్డు నెక్కొండ రోడ్డులో వర్షపు నీరు నిలిచి, గుంతలు ఏర్పడటంతో స్థానికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను శుక్రవారం మున్సిపల్ అధికారులు పరిశీలించారు. 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి, గుంతలను వెంటనే పూడ్చి, నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపటిలోపు గుంతలు పూడ్చి, తగిన ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ భాస్కర్ హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్